SPECIAL FESTIVALS AT SRI KRT IN JANUARY 2024 _ జనవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 31 December 2023:  Following are the special festivals observed at the Sri Kodandarama Swamy temple during January 2024.

January 6,13, 20 and 27 special Abhishekam performed to Sri Seetharama Lakshmana main idols at the temple in the morning and later Unjal Seva and Thiru veedhi utsavam and Asthanam in the evening.

January 11: Amavasya sahasra Kalashabisekam in the morning and Hanumanta Vahana Seva in the evening.

January 25: Pournami Astothara sata Kalashabisekam,  Seethramula Kalyanam 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2023 డిసెంబ‌రు 31: తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠జనవరిలో 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, తిరువీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

•⁠ ⁠జనవరి 11న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

•⁠ ⁠జనవరి 25న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు

•⁠ ⁠జనవరి 25వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, ఆస్థానం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.