IT APPLICATION FOR BIRRD BEFORE JAN END-TTD EO _ జనవరి చివరి నాటికి బర్డ్‌లో ఐటి అప్లికేషన్ అమలు కావాలి – అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం

Tirupati, 2 Jan. 21: The exclusive IT application designed for BIRRD Hospital should come in vogue before January end, said TTD EO Dr KS Jawahar Reddy directing the officials concerned.

The EO reviewed the development activities in BIRRD hospital with TTD IT and BIRRD officials in his chambers in TTD Administrative Building in Tirupati on Saturday. He said the application should be developed in three modules including executive, clinical and financial operations. 

The EO also suggested the concern to develop the application in such a way that it should have the data of outpatient and inpatient statistics with details of laboratory, pharmacy and discharge modules. He directed the officials concerned to coordinate with the CMO of TTD over the execution of the Store Inventory in BIRRD. He said the details of the Facility Management, Hospital Management, Materials and Medicines should also be included in this app. 

Later he learnt about the functioning of operation theatres, doctors, billing systems etc. in BIRRD hospital from the doctors and IT experts. 

BIRRD Honorary Director Sri Madanmohan Reddy, IT In-charge Sri Sesha Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి చివరి నాటికి బర్డ్‌లో ఐటి అప్లికేషన్ అమలు కావాలి-  అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం

తిరుప‌తి, 02 జనవరి 2021: జనవరి చివరి వారం లోపు బర్డ్ ఆసుపత్రి నిర్వహణ, సేవలకు సంబంధించిన ఐటి అప్లికేషన్ అమలు కావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో శనివారం ఆయన బర్డ్, ఐటి విభాగం అధికారులతో సమావేశమయ్యారు. బర్డ్ ఆసుపత్రి నిర్వహణ విధానానికి సంబంధించిన ఐటి అప్లికేషన్ పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అప్లికేషన్ లో ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్, ఆర్థిక వ్యవహారాలు మూడు విభాగాలుగా ఉండాలన్నారు. అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్,  వీరిద్దరికీ సంబంధించిన లెబరేటరీ, ఫార్మసీ మాడ్యూల్స్, డిశ్చార్జ్ మాడ్యూల్ ఇందులో ఉండాలని అధికారులకు సూచించారు. టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో సమన్వయం చేసుకుంటూ బర్ద్ అధికారులు స్టోర్స్ ఇన్వెంటరీ నిర్వహించాలన్నారు.  ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఆసుపత్రి పరిపాలన,  మెటీరియల్ మరియు మెడిసిన్ అంశాలు ఈ అప్లికేషన్ లో పొందుపరచాలని ఈవో చెప్పారు. బర్ద్ లోని ఏడు ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యం,  డాక్టర్ల పని తీరు, బిల్లింగ్ విధానం గురించి బర్ద్, ఐటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బర్ద్ ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, ఐటి ఇంచార్జ్ శ్రీ శేషారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.