జనవరి 1వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు 

జనవరి 1వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

తిరుపతి, డిశెంబర్‌- 18, 2009: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకొని డిశెంబర్‌ 31వ తేది నుంచి జనవరి 2వ తేది వరకు శ్రీవారికి అనునిత్యం జరిగే ఆర్జితసేవలను రద్దు చేసారు. సహస్రదీపాలంకరణ సేవ (సర్కారు) మాత్రం యథావిధిగా జరుగుతుంది. తిరుప్పావై అభిషేకం (ఏకాంతం) అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.