CHAGANTI DISCOURSES ON VEDA CULTURE- BHAKTI VAIBHAVAM _ జనవరి 12, 13వ తేదీల్లో “వేద సంస్కృతి – భ‌క్తి వైభ‌వం”పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసాలు

Tirupati, 10 Jan. 20: Under the auspices of Sri Venkateswara Higher Vedic Studies of TTD, Brahmarshi Chaganti Koteshwara Rao will present  Dharmic discourses on the theme Veda culture-Bhakti Vaibhavam on January 12 and13 .

The popular discourses will be held in the evening 6-8 pm at the Gita Jayanti platform of SV High School Grounds, Tirupati.

The discourses are part of TTD  Sanatana Dharma campaign presenting popular discourses by prominent Pontiffs and exponents.

TTD has appealed to citizens of Tirupati to attend these discourses and get benefit of Dharmic wisdom.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

జనవరి 12, 13వ తేదీల్లో “వేద సంస్కృతి – భ‌క్తి వైభ‌వం”పై  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసాలు

తిరుప‌తి,  2020 జనవరి 10: టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో జనవరి 12, 13వ తేదీల్లో “వేద సంస్కృతి – భ‌క్తి వైభ‌వం” అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం చేయనున్నారు. తిరుప‌తిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో గ‌ల గీతా జ‌యంతి వేదిక‌పై సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఈ ఉప‌న్యాస కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

ధర్మప్రచారంలో భాగంగా ప్రముఖ స్వామీజీలు, పండితులతో టిటిడి తరచుగా ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసాలను టిటిడి ఏర్పాటుచేసింది. తిరుప‌తివాసులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ధార్మిక చైత‌న్యం పొందాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.