GODA KALYNAM AND PARUVETA UTSAVAM ON JAN 16 _ జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

TIRUMALA, 14 JANUARY 2023: In Tirumala Goda Parinayam and Paruveta Utsavam will be observed on January 16.

In the morning, Andal Sri Goda garlands will be brought to Tirumala from Pedda Jeeyar Mutt in a procession and offered to the main deity inside the sanctum sanctorum.

Later in the afternoon Sri Malayappa Swamy along with Sri Krishna Swamy will reach the Paruveta Mandapam by 1pm. After the Paruveta Utsavam they reach the Tirumala temple at 6pm.

TTD has cancelled arjita sevas including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Seva on that day.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

తిరుమల, 14 జనవరి 2023:  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున  కనుమ పండుగనాడైన జనవరి 16న ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.
       
గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

ఆనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు తిరుమలనంబి ఆలయానికి వేంచేపు చేస్తారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు :

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.