BHOGI TERU HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా భోగితేరు

TIRUPATI, 14 JANUARY 2023: The Bhogi Teru was observed in Sri Govindaraja Swamy temple on Saturday in connection with auspicious Bhogi.

On January 15, on the auspicious occasion of Makara Sankranti Tirumanjanam will be performed.

On January 16 Goda Parinayam will be performed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా భోగితేరు

తిరుపతి, 14 జనవరి 2023:  శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శనివారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు.

ఇందులోభాగంగా సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామి వారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభంగా ఊరేగింపు నిర్వహించారు. భ‌క్తులు క‌ర్పూర‌హార‌తులు స‌మ‌ర్పించి స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు.

జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. బాలాలయం జరుగుతున్న కారణంగా జనవరి 16న కనుమ రోజు నిర్వహించే పార్వేట ఉత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

జనవరి 16న గోదా ప‌రిణ‌యోత్స‌వం

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 16న గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉద‌యం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం శ్రీ గోదా ప‌రిణ‌యోత్స‌వం వేడుకగా నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి విఆర్.శాంతి, ఏఈఓ శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ప్రసాదమూర్తిరాజు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.