GIRI PRADAKSHINA UTSAVAM AT NARAYANAVANAM ON JANUARY 17 _ జనవరి 17న నారాయణవనంలో గిరిప్రదక్షిణ ఉత్సవం
Tirupati, 11 Jan. 20: TTD is organising the unique festival of Kondachuttu Tirunalu also known as Giri Pradakshina utsavam at Sri Kalyana Venkateswara Swamy temple in Narayanavanam on January 17.
As a part of the event, the utsav idols of Sri Agasteeshwara Swamy and Sri Parasareswara Swamy utsava idols will be taken out in Giri Pradakshina on banks of Aruna river and few villages near Nagari town.
The local deities of these villages also join the main procession at Kondacuttu mandapam or special pujas and other rituals.
Later on the utsava idols will be returned to Narayanavanam temple.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
జనవరి 17న నారాయణవనంలో గిరిప్రదక్షిణ ఉత్సవం
తిరుపతి, 2020 జనవరి 11: నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అగస్తీశ్వరస్వామి మరియు శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఉత్సవమూర్తుల గిరిప్రదక్షిణ ఉత్సవం(కొండచుట్టు తిరునాళ్ల) జనవరి 17వ తేదీన ఘనంగా జరగనుంది. ఉదయం శ్రీపరాశరేశ్వరస్వామివారు నారాయణవనం పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. అరుణా నది వద్ద శ్రీ అగస్తీశ్వరస్వామివారితో కలిసి ఊరేగింపుగా రాత్రి నగరిలోని కొండచుట్టు మండపం వద్దకు చేరుకుంటారు. నగరి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వివిధ దేవతామూర్తులను కొండచుట్టు మండపం వద్దకు చేర్చి పూజా నైవేద్య కార్యక్రమాలు, సంధింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతరం శ్రీ అగస్తీశ్వరస్వామివారు, శ్రీ పరాశరేశ్వరస్వామివారు బయలుదేరి మొట్టిగాని సత్రం, పరమేశ్వరమంగళం, బత్తలవారి కండ్రిగ మీదు నారాయణవనంలోని ఆయా ఆలయాలకు చేరుకుంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.