జనవరి 18న ఖమ్మం జిల్లాలో శ్రీనివాస కల్యాణం
జనవరి 18న ఖమ్మం జిల్లాలో శ్రీనివాస కల్యాణం
తిరుపతి, జనవరి 13, : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లాలోని పాలంచలో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుంది.
పాలంచలోని విద్యుత్ కళాభారతి మైదానంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభమవుతుంది. ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ సుభాషిణి మహీపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ కె.రామకృష్ణ ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.