కాలిబాట మార్గంలో గణనీయంగా పెరిగిన భక్తుల సంఖ్య

కాలిబాట మార్గంలో గణనీయంగా పెరిగిన భక్తుల సంఖ్య

తిరుమల, 13 జనవరి 2013: తిరుమల శ్రీవారి దర్శనార్థం శని, ఆదివారాలలో అనూహ్యంగా పెరగడంతో తి.తి.దే తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో నుండి తిరుమలకు విచ్చేసే భక్తులకు అందించే దివ్యదర్శన టోకన్ల సంఖ్య పెంచుతున్నట్లు తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో పెరిగిన ఈ అనూహ్య కాలబాట రద్దీ దృష్ట్యా ఈ రెండు మార్గాలకు కలిపి 20 వేలు దివ్యదర్శన టోకెన్లును ఇవ్వనున్నారు.
 
సాధారణంగా ఇచ్చే 15 వేల టోకన్ల స్థానే 20 వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.