జనవరి 2 నుండి 5వ తేదీ వరకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచనలపై జాతీయ సదస్సు
జనవరి 2 నుండి 5వ తేదీ వరకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచనలపై జాతీయ సదస్సు
తిరుపతి, జనవరి 01, 2013: తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ”భారతీయ సాంస్కృతిక పరిరక్షణ – విశ్వనాథ సాహిత్యం”పై జనవరి 2 నుండి 5వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతీయ సదస్సు జరుగనుంది.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. అనంతరం మధ్యాహ్నం మొదటి సదస్సులో ‘భారతీయ సాంస్కృతిక పరిరక్షణ – శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ అనే అంశంపై చర్చించనున్నారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సదస్సులు జరుగనున్నాయి. తెలుగు సాహిత్యంలో ఉద్దండులైన పండితులు పాల్గొని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యంపై లోతైన విశ్లేషణ చేయనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.