జనవరి 20 నుండి 22వ తేదీ వరకు తిరుపతిలో పల్స్‌పోలియో

జనవరి 20 నుండి 22వ తేదీ వరకు తిరుపతిలో పల్స్‌పోలియో

తిరుపతి, జనవరి 19, 2013: యాత్రికులు, నగరవాసుల సౌకర్యార్థం తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో జనవరి 20 నుండి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది. తిరుపతిలో మొత్తం ఆరు కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
 
తిరుపతిలోని తితిదే కేంద్రీయ వైద్యశాల, శ్రీనివాసం కాంప్లెక్స్‌, బైరాగిపట్టెడలోని వైద్యశాల,  అలిపిరి, అలిపిరి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో పల్స్‌పోలియో శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.  ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని తితిదే కోరుతోంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.