HOLY ADHYAYANOTSAVAM AT SRI GRT FROM JAN 25 _ జనవరి 25 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
Tirupati, 19 Jan. 20: A 24 day holy utsavam of Adhyayanotsavam will be performed at the TTD local temple of Sri Govindarajaswamy from January 24-February 17.
It is an age old practice to perform the unique ritual of Parayanam of Divya Alwar Prabandam in Magha masam.
TTD also plans to conduct Chinna Sattumora on February 4, pranaya kalahotsavam on February 10 and Pedda Sattumora on February 14.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జనవరి 25 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
తిరుపతి, 2020 జనవరి 19: టిటిడి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 25 నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 4న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 10న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 14న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.