జూన్‌ 25వ తేది నుండి జూలై 2వ తేది వరకు  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గోవింద కళ్యాణాలు

జూన్‌ 25వ తేది నుండి జూలై 2వ తేది వరకు  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గోవింద కళ్యాణాలు

తిరుపతి, 2010 జూన్‌ 19: తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోవింద కళ్యాణాలు మూడవ విడతగా జూన్‌ 25వ తేది నుండి జూలై 2వ తేది వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని వివిధ గ్రామాలలో వైభవంగా జరుగుతాయి.

ఈ గోవింద కళ్యాణాలు శ్రీకాకుళం జిల్లాలోని జూన్‌ 25వ తేదిన సీతంపేట, 26వ తేదిన గనసర, 27వ తేదిన మందస తదితర గ్రామాలలో జరుగుతాయి. అదేవిధంగా విజయనగరం జిల్లాలో జూన్‌ 29వ తేదిన మందెంకళ, జూన్‌ 30వ తేది బొమ్మలక్ష్మీపురం, జూలై 1వ తేదిన మంచదవలస, జూలై 2వ తేదిన మామిడిపల్లి తదితర గ్రామాలలో జరుగుతాయి.  

ఈ గోవింద కళ్యాణాలలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.