KRT EVENTS _ జూన్ లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
TIRUPATI, 29 MAY 2022: The following are the religious events in the temple of Sri Kodanda Ramalayam in Tirupati for the month of June.
June 4, 11, 18, 25: Abhishekam to Mulavarulu
June 3: Sita Rama Kalyanam on Punarvasu star
June 14: Astottara Sata Kalasabhishekam on Pournami
June 28: Sahasra Kalasabhishekam on the occasion of Amavasya and Hanumanta Vahanam in the evening
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2022 జూన్ 29: తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– జూన్ 4, 11, 18, 25వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
– జూన్ 3న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
– జూన్ 14న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.
– జూన్ 28న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.