SUNDARAKANDA AKHANDA PARAYANAM FOR THE WELL-BEING OF THE GLOBAL HUMANITY-TTD EO _ దేశప్రజల ఆయురారోగ్యాల కోసమే సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
HUGE RESPONSE FROM OVERSEAS DEVOTEES
Tirumala, 29 May 2022: The Akhanda Sampoorna Sundarakanda Pathanam is aimed at peace, health and prosperity of entire humanity, said TTD EO Sri AV Dharma Reddy.
Participating in the event the TTD EO told media persons that as per puranic legends pleased with the penance by Anjana Devi in Tirumala, Hanuman was born with the blessings of Vayudeva. The fact that Anjanadri Tirumala is the birthplace of Sri Anjaneya Swamy was published by TTD in a book after year-long research and compilation of epigraphical, puranic and geographical evidence.
He said TTD has organised Hanuman Jayanti festivities at the Sri Bala Anjaneya – Anjadevi temple at Akashaganga and a five-day Abhiseka Mahotsavam was conducted there.
Similarly, Bhakti sangeet and dharmic programs were also held at Nada Niranjanam platform and Japali in Tirumala from May 25-29.
The EO said the Sundarakanda in epic Ramayana comprises 2800 odd shlokas in which Anjaneya narrated his exploration of Sri Lanka in search of Sita Devi which took him 18 long hours. Similarly, the Vedic pundits performed the parayanam from morning 5.30am which lasted till 11pm.
He said the entire program has been live telecasted by SVBC for the benefit of global devotees. Lakhs of devotees participated in this unique Parayanam sitting at their homes and chanted the Shlokas. “Even the devotees from the US, Australia and other countries forwarded their messages of participation in the programme”, he maintained.
CEO SVBC Sri Suresh Kumar, SE 2 Sri Jagadeshwar Reddy, Health Officer Dr Sridevi, DFO Sri Srinivasulu Reddy, DyEO Annaprasadam and Donor Cell Smt Padmavathi, VGO Sri Bali Reddy, OSD Sri Ramakrishna, Special Officer Estates Sri Mallikarjuna and others were present.
Among others, Agama Advisor Sri Mohana Rangacharyulu, Chief Priests Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, Veda Pathashala Principal Sri KSS Avadhani, Vedic scholars, devotees were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
దేశప్రజల ఆయురారోగ్యాల కోసమే సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
– దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా పారాయణం
– విదేశాల్లోని భక్తుల నుండి అపూర్వ స్పందన
తిరుమల, 2022 మే 29: దేశప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహిస్తున్నట్టు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు అఖండ పారాయణం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈఓ మీడియాతో మాట్లాడుతూ హనుమంతుల వారు అంజనాదేవి తపోఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని పండిత పరిషత్ ఒక సంవత్సరం పాటు పరిశోధించి పురాణ, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలతో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిగా ప్రకటించి ఒక పుస్తకం ముద్రించినట్టు తెలిపారు. కొన్నేళ్లుగా ఇక్కడి అంజనాద్రిలోని ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయస్వామి ఆలయం ఉన్నట్టు చెప్పారు. హనుమ జన్మస్థానంలో గతేడాది నుండి ఇక్కడ హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మే 25 నుండి 29వ తేదీ వరకు ఇక్కడి ఆలయంలోని శ్రీ బాలంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా నాదనీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి ప్రాంతాల్లో ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,808 శ్లోకాలను నాలుగు బృందాల్లో పండితులు పారాయణం చేస్తున్నారని చెప్పారు. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుండి లంఘించి సముద్రం దాటుకుని లంకకు చేరుకుని రాక్షసులను సంహరించి సీతమ్మ జాడను తెలుసుకుని తిరిగి రాముని వద్దకు చేరుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పట్టిందని రామాయణం ద్వారా తెలుస్తోందన్నారు. హనుమంతుడు ఎలా అయితే విశ్రాంతి లేకుండా రామకార్యం కోసం వెళ్లారో అదేవిధంగా పండితులు ఉదయం 5.30 నుంఉ రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా 18 గంటల పాటు పారాయణం చేస్తున్నారని వివరించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తమ ఇళ్ల నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్లోకాలు పారాయణం చేశారని చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుండి భక్తులు శ్లోకపారాయణం చేసినట్టు సందేశాలు అందాయన్నారు. ఈ పారాయణంలో పాల్గొన్న వారికి, టీవీల ద్వారా వీక్షించినవారికి శ్రీరాముడు, హనుమంతుని ఆశీస్సులు తప్పక లభిస్తాయన్నారు.
ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులురెడ్డి, డెప్యూటీ ఈఓ శ్రీమతి పద్మావతి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఓఎస్డి శ్రీ రామకృష్ణ, ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని, వేదపండితులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.