జూన్ 20 నుండి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు
జూన్ 20 నుండి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు
తిరుపతి, 2021 జూన్ 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుండి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరుగనున్నాయి. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.
ఈ ఐదు రోజుల పాటు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరుమంజనం(అభిషేకం) చేపడతారు. జూన్ 20న శ్రీకృష్ణస్వామివారికి, జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తుకు అభిషేకం నిర్వహిస్తారు. తెప్పోత్సవాల కారణంగా ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం రద్దు చేశారు
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.