జూన్ 22 నుండి 26వ తేది వ‌ర‌కు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

జూన్ 22 నుండి 26వ తేది వ‌ర‌కు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుపతి, 2010 జూన్‌ 13: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 22వ తేది నుండి 26వ తేది వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల మధ్య ఐదు రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి.

ఈ తెప్పోత్సవాలలో మొదటిరోజు శ్రీకృష్ణస్వామి వారు, రెండవ రోజు శ్రీ సుందరరాజస్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. చివరి మూడు రోజులు సర్వాలంకార శోభితురాలైన శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా 25వ తేదిన గజవాహనం, 26వ తేదిన గరుడవాహనం పై అమ్మవారు తిరువీధులలో విహరిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.