జూన్ 24న టిటిడి ముద్రణాలయ నూతన భవనం ప్రారంభోత్సవం

జూన్ 24న టిటిడి ముద్రణాలయ నూతన భవనం ప్రారంభోత్సవం

తిరుపతి, 2010 జూన్‌ 22: తిరుమల తిరుపతి దేవస్థానముల ముద్రణాలయ నూతన భవన ప్రారంభోత్సవము ఈనెల 24వ తేది ఉదయం 7-52 గంటలకు ఘనంగా జరుగుతుంది. తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె. ఆదికేశవులు ఈ నూతన ముద్రణాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.  

దేవస్థానం మహంతుల పరిపాలన నుంచి ధర్మకర్తల మండలి ఆధీనానికి వచ్చిన తరువాత శ్రీవేంకటేశ్వరా ఓరియంటర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నెలకొల్పబడింది. ఇందులో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, మానవల్లి రామకృష్ణ శాస్త్రి, కొరాడ రామకృష్ణయ్య, పంగనామాల బాలకృష్ణమూర్తి, కోళియాలం మొదలైన పండితులు తితిదే ప్రచురణలకు నాంది పలికారు.

తితిదే ముద్రణాలయం రామాయణ, మహాభారతం, భాగవతం, భగవద్గీత వంటి ఇతిహాసాలతో పాటు వేలకొలది గ్రంధాలను ప్రచురించినది. వాటిలో సాహిత్య విలువలు కలిగిన గ్రంధాలు చాలావున్నాయి.

1949వ సంవత్సరంలో దేవస్థానం బులిటన్‌ ప్రారంభించినది. తిరుమల శ్రీనివాసుని దర్శించు కొనేందుకు వచ్చే వేలాది యాత్రికులకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సౌకర్యాల వివరాలను భక్తులకు తెలియజేసే ఒక ప్రాచార సాధనంగా బులిటెన్‌ ఉపయోగపడింది. అప్పటి నుండి నిర్విరామంగా వెలువడుతున్న బులిటెన్‌కు ‘సప్తగిరి’ అని నామకరణం చేసారు.

ప్రస్తుతం తితిదే ప్రచురిస్తున్న పంచాంగాలు, డైరీలు,క్యాలండర్లు మంచి ప్రజాదరణ పొందాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.