JYESTABHISHEKAM AT SRI GT FROM JUNE 30 – JULY 2 _ జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

Tirupati,29 June 2023: TTD is organizing a grand festival of Jyestabhishekam (Abhidyeyaka Abisekam) at Sri Govindaraja Swamy temple from June 30 -July 2 where in the Golden Kavacha of utsava idols of Sri Govindaraja Swami and His consorts are removed and readorned three days after the rituals.

 

As part of the proceedings of the fête Kavachadivasam will be performed on Day -1 that is June 30, Kavacha Pratista and Kavacha Samarpana rituals are observed on July 1 and 2.

 

On all three days, TTD Archakas will perform Maha Shanti Homa and Punyahavachanam in the morning followed by Snapana Tirumanjanam to the utsava idols and Veedhi Utsavams.

 

Legends say that the Jyestabhishekam fete is observed in the temple every year during Ashada month in the advent of the Jyesta star.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

తిరుపతి, 2023 జూన్ 29: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం(అభిధేయక అభిషేకం) జరుగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు ఏడాదికోసారి స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చుతారు.

ఇందులో భాగంగా జూన్ 30న కవచాధివాసం, జూలై 1న కవచ ప్రతిష్ఠ, జూలై 2న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.