ANKURARPANAM HELD FOR SRI KT PAVITROTSAVAM _ శ్రీ కపిలేశ్వరుని ‌ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati,29 June 2023: TTD organised a grand Ankurarpanam fete for the three days celestial annual Pavitrotsavams at Sri Kapileswara Swamy temple on Thursday evening. 

The legends say the festival is organised as per Agama traditions to ward off the bad impact of any lapses during the year in the temple.

On day one on June 30, the utsava idols are offered Snapana  Tirumanjanam in the morning and Kalasa Puja, Homas and Pavitra Pratista in the evening. On day-2 on July 1, Pavitra Grandhi Samarpana and Yagashala Puja, Homas will be held. On day-3 on July 2 Maha Purnahuti, Kalasa Udhwasana, Pavitra Samarpana are performed.

Finally, Asthanam is observed for all five utsava idols of Sri Kapileswawara, Sri Kamakshi, Sri Vigneswara, Sri Subramanya and Sri Chandikeswara.

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Subba Raju and Superintendent Sri Bhupati were present. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరుని ‌ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2023 జూన్ 29: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.

జూన్ 30న ప‌విత్ర ప్ర‌తిష్ఠ, జులై 1న గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, జులై 2న మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ‌చివరిరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మ‌ణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు తిరువీధి ఉత్స‌వం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.