VISESHA SAHASRA KALASABHISHEKAM OF SRI BHOGA SRINIVASAMURTHY ON JUNE 5 _ జూన్ 5న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

Tirumala, 4 Jun. 22: As part of its 16-year-old tradition the TTD is organising a Vishesh Sahasra Kalashabhisekam of Sri Bhoga Srinivasamurthy on June 5 at Srivari temple.

 

In this connection, the Ekantha Sahasra Kalashabhisekam will be performed by Archakas to Sri Bhoga Srinivasa idol at the Bangaru vakili inside the temple between 06.00-08.00 am. All arjita sevas will also be conducted as scheduled on the day of festivities.

 

Legend say that the 18 cm high statue of Sri Bhoga Srinivasa idol was presented to the temple in 614 by Pallava queen Somavai Perundevi as indicated by a rock inscription on the first prakaram wall of the temple.

 

Agama traditions say that Sri Bhoga Srinivasa idol is one of the five idols (Pancha Beras) in the Srivari temple and also known as Kauthukamurthy or Sri Manavala Perumal.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 5న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

తిరుమల, 2022 జూన్ 04: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 5వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 16 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంనాడు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.

చారిత్రక నేపథ్యం :

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.