GREEN CARPET ON FOOTPATH IN 24 HOURS- TTD CHAIRMAN _ నడక దారిలో భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

 * CHAIRMAN MOVED BY DEVOTEES TRAVAILS IN HOT SUN

* DEVOTEES THANK CHAIRMAN FOR SPONTANEOUS ACTION

Tirumala, 4 Jun. 22: Moved by the hardships of devotees walking on burning steps and blacktopped roads the TTD chairman Sri YV Subba Reddy on Saturday directed officials to organise on a war footing a green carpet along the footpath within 24 hours.

While on a downward journey to Tirumala on Friday the chairman was moved by the sight of suffering devotees at Mokali Mettu and Akkagarla Gudi. Stopping on the way he interacted with the devotees and heard their woes of hardships of walking in the hot sun and blazing stone steps and blacktopped roads.

Immediately he contacted TTD Chief engineer Sri Nageswara Rao and instructed him to put green carpet and spray water within 24 hours. The officials jumped into action and by Saturday morning spread green carpet and sprayed water at various junctions notified of the scorching heat.

The devotees were thrilled by the swift action of TTD and complimented the TTD chairman for his spontaneous action with regard to devotees hardships.

Speaking on the occasion the TTD chairman said in view of summer heat and common devotees massive rush to the hill shrine during the last days of summer officials were directed to organise facilities on footpaths and also on junctions of Tirumala.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నడక దారిలో భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

– 24 గంటల్లో నడక మార్గంలో భక్తుల కాళ్ళు కాలకుండా గ్రీన్ కార్పెట్ ఏర్పాటు

– చైర్మన్ సత్వర స్పందనపై భక్తుల కృతజ్ఞతలు

తిరుమల 4 జూన్ 2022: అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చలించిపోయారు. భక్తులు కాళ్ళు కాలకుండా ఉండటం కోసం యుద్ధప్రాతిపదికన గ్రీన్ కార్పెట్ ఏర్పాటుచేయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో నడక దారిలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడివరకు భక్తులు కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులను చూసి చలించారు. భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందిని తెలుసుకున్నారు. నడక మార్గం లోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి మలుపు వరకు వెంటనే గ్రీన్ మ్యాట్ వేయించి నీరు చెల్లించే ఏర్పాటు చేయాలని చీఫ్ ఇంజినీరింగ్ శ్రీ నాగేశ్వరరావును ఆదేశించారు. 24 గంటల్లో పని పూర్తి చేసి తనకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశం మేరకు ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయానికి ఈ మార్గంలో గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసి దాని మీద నీళ్లు చెల్లించే ఏర్పాటు చేశారు. తమ ఇబ్బందిని గమనించి వెంటనే స్పందించి తగిన ఏర్పాటు చేయించడం పట్ల భక్తులు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సామాన్య భక్తుల సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నడక మార్గాలు, తిరుమలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది