జూన్‌ 6వ తేది నుండి 14వ తేది వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 

జూన్‌ 6వ తేది నుండి 14వ తేది వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, జూన్‌ 02, 2011: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్‌ 6వ తేది నుండి 14వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. 5వ తేదిన అంకురార్పణం నిర్వహిస్తారు.

  ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీ గోవిందరాజస్వామి వారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలను అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు.
 
తేది ఉదయం     సాయంత్రం
06-06-2011 ధ్వజారోహణం (ఉ.9.10 గంటలకు) పెద్దశేష వాహనం
07-06-2011 చిన్నశేష వాహనం హంస వాహనం
08-06-2011 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
09-06-2011 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
10-06-2011 పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం) గరుడ సేవ
11-06-2011 హనుమంత వాహనం గజ వాహనం
12-06-2011 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
13-06-2011 రథోత్సవం (ఉ.7.45 గంటలకు) అశ్వ వాహనం
14-06-2011 చక్రస్నానం ధ్వజావరోహణం
             (బంగారు తిరుచ్చి ఉత్సవం)
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.