జూలై 12న టిటిడి ఉద్యోగాలకై ప్రకటనలు

జూలై 12న టిటిడి ఉద్యోగాలకై ప్రకటనలు

తిరుపతి, 2010 జూలై 28: ఈనెల 12వ తేదిన వివిధ దినపత్రికలలో తితిదేలో వివిధ ఉద్యోగాలకై ప్రకటనలు ఇచ్చిన విషయం విదితమే.

ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు ఈనెల 30వ తేది సాయంత్రం 5-00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆపై దరఖాస్తు చేసుకుంటే వాటిని స్వీకరించరు. అదేవిధంగా ఈనెల 31వ తేది లోపు బ్యాంకు పనివేళలలో చలానా కట్టాలి. ఆపైన కట్టిన చలానాలు అంగీకరించబడవు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.