జూలై 15న తితిదే ఉద్యోగులకు శ్వాసకోశ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం
జూలై 15న తితిదే ఉద్యోగులకు శ్వాసకోశ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం
తిరుపతి, 2012 జూలై 11: తితిదే కేంద్రీయ వైద్యశాలలో జూలై 15వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. చెన్నై అపోలో ఆస్పత్రికి చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ నరసింహన్ వైద్యసేవలు అందించనున్నారు. ఉదయం 9.00 గంటలకు వైద్య శిబిరం ప్రారంభమవుతుంది. తితిదే ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు ఇందులో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.