జూలై 15 నుండి విరాటపర్వం పారాయణం
జూలై 15 నుండి విరాటపర్వం పారాయణం
తిరుమల 2020 జూలై 14: తిరుమల నాదనీరాజనం వేదికపై జూలై 15వ తేదీ నుండి విరాటపర్వం పారాయణం ప్రారంభం కానుంది. ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ పారాయణాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇప్పటికే ఈ వేదికపై ఉదయం సుందరకాండ పారాయణం జరుగుతున్న విషయం తెలిసిందే.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.