జూలై 18న అమృతోత్సవాలపై శ్వేతాలో మేధవుల అభిప్రాయ సేకరణ
జూలై 18న అమృతోత్సవాలపై శ్వేతాలో మేధవుల అభిప్రాయ సేకరణ
తిరుపతి, జూన్-17, 2008: తిరుమల తిరుపతి దేవస్థానములు జూలై నెలలో నిర్వహించదలచిన అమృతోత్సవాలు ఎలా నిర్వహించాలి, ఏమేమి చేస్తే బాగుంటుంది, విధి విధానాల గురించి అభిప్రాయాల సేకరణకై శ్వేత నందు జూలై 18వ తేది ఉదయం 10.30 గం||లకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశంలో తి.తి.దే., పాలకమండలి అధ్యకక్షులు శ్రీభూమన కరుణాకరరెడ్డిగారు, కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారిగారు హాజరవుతున్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులైన పెద్దలు, విజ్ఞులు, మేదావులు ఈ సమావేశానికి హాజరై అమృతోత్సవాలు నిర్వహించడానికి గాను అవసరమైన మంచి అభిప్రాయములను తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.