జూలై 18 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

జూలై 18 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

తిరుపతి, జూలై 09, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 18 నుండి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం) ఘనంగా జరుగనుంది. ఇందులో స్వామివారి స్వర్ణ కవచాలకు మొదటిరోజు కవచ అధివశం, రెండో రోజు కవచ ప్రతిష్ఠ, చివరిరోజు కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం  మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్టా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.

జూలై 14 నుండి 18వ తేదీ వరకు మహతిలో ధార్మిక ప్రవచనాలు

తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జూలై 14 నుండి 18వ తేదీ వరకు ధార్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. రాజమండ్రికి చెందిన ప్రముఖ వాస్తు జ్యోతిశాస్త్ర పండితులు డాక్టర్‌ ప్రభల సుబ్రహ్మణ్యం వ్యాసుడు – నన్నయ, శ్రీనాథుడు రచించిన ”నలోపాఖ్యానం”, వ్యాసుడు- ఎర్రన రచించిన ”ధర్మవ్యాధోపాఖ్యానం” అంశాలపై ఉపన్యసిస్తారు.

నలోపాఖ్యానికి దమయంతోపాఖ్యానమని కూడా పేరు. ఈ ఘట్టం నన్నయ రచించిన భారతంలోని అరణ్యపర్వం ద్వితీయాశ్వాసంలోనిది. ఇందులోని అంశాలను విశదీకరిస్తూ శ్రీనాథుడు ”శృంగారనైషధం” రచించారు. అటు వ్యాసుడు, ఇటు నన్నయ, శ్రీనాథుడు వివరించిన అంశాలను ప్రభలవారు తన ఉపన్యాసంలో ప్రవచిస్తారు. ధర్మవ్యాధోపాఖ్యానం భారతంలోని అరణ్యపర్వం పంచమాశ్వాసంలోనిది. దీన్ని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.