జూలై 3న శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ
జూలై 3న శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ
తిరుపతి, 2023 జూలై 01: పౌర్ణమి సందర్భంగా జూలై 3న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ జరుగనుంది.
ప్రతినెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారు గరుడునిపై ఆలయ ప్రధాన వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.