జూలై 3 నుండి 5వ తేదీ వరకు శ్వేతలో చతురాగమ సదస్సు

జూలై 3 నుండి 5వ తేదీ వరకు శ్వేతలో చతురాగమ సదస్సు

తిరుపతి, 2012 జూలై 02: భారతీయ సంస్కృతిలో ఆగమశాస్త్ర విశిష్టతను భావితరాలకు అందించాలన్న ఉన్నతాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం జూలై 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలోని శ్వేత భవనంలో చతురాగమ సదస్సు నిర్వహించనుంది. ఇందులో వైఖానస, పాంచరాత్ర, శైవ, వైదికస్మార్త ఆగమాలపై పండితులు పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు.

మంగళవారం ఉదయం 9.00 గంటలకు ప్రారంభ సమావేశం జరుగనుంది. ఇందులో మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుయతీంద్రతీర్థ శ్రీపాదులవారు అనుగ్రహభాషణం చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు డాక్టర్‌ వేదాంతం శ్రీ విష్ణుభట్టాచార్యులు అధ్యక్షతన వైఖానసాగమం, జూలై 4వ తేదీ ఉదయం 10.00 గంటలకు శ్రీ చిలకపాటి తిరుమలాచార్యులు అధ్యక్షతన పాంచరాత్రాగమం, మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీ అన్నవరపు సుబ్రహ్మణ్యదీక్షిత అవధాని అధ్యక్షతన శైవాగమం, జూలై 5వ తేదీ ఉదయం 10.00 గంటలకు శ్రీ నరేంద్ర కాప్రేయశర్మ అధ్యక్షతన వైదికస్మార్తాగమం  పై సదస్సులు నిర్వహించనున్నారు. జూలై 5వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు ముగింపు సమావేశం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.