జూలై 5వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘సీఈఓగా మీరే దిక్కు .. తిరుమలేశా..!’
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
జూలై 5వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘సీఈఓగా మీరే దిక్కు .. తిరుమలేశా..!’
అనే వార్తకు వివరణ
జూలై 5వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘సీఈఓగా మీరే దిక్కు .. తిరుమలేశా..!’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.
సీఈఓ నియామక ప్రకటన ఏ ఒక్క వ్యక్తినీ ఉద్దేశించినది కాదు. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. ఛానల్ అవసరాల రీత్యా, అలాగే ఛానల్‌ను మరింత విస్తరించనున్న దృష్ట్యా ఒక పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం అవసరమున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇక ఛానల్ సీఈఓ నియామకానికి ఇచ్చిన అర్హతలలో ఎలక్ట్రానిక్ మీడియాలో 25 సంవత్సరాల అనుభవం ఉండాలనే నిబంధనను 15 సంవత్సరాలుగా మార్చడం జరిగింది. దీంతోపాటు రెండు మూడేళ్లపాటు ఏదైనా ఛానల్‌ను నడిపిన అనుభవం ఉండాలి. అలాగే కనీస వయసు 45 సంవత్సరాలుగానూ, గరిష్ట వయో పరిమితి 60 సంవత్సరాలుగానూ నిర్ణయించడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల విషయంలో సడలింపు ఉంటుంది.
కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి