జూలై 6న తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం వీడ్కోలు సభ

జూలై 6న తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం వీడ్కోలు సభ

 తిరుపతి, జూలై 05, 2013: తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ సందర్భంగా శనివారం సాయంత్రం 4.00 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా వీడ్కోలు సభ జరుగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తితిదే ఉద్యోగులు, అభిమానులు పాల్గొనాలని విజ్ఞప్తి చేయడమైనది. ఇదే కార్యక్రమంలో తితిదే నూతన ఈవో శ్రీ ఎంజి.గోపాల్‌కు ఘనమైన ఆహ్వానం పలకనున్నారు. ఈ వేదికపై సంగీత కార్యక్రమాలతో పాటు తితిదే ఉన్నతాధికారులు తమ సందేశాలను అందజేస్తారు.

   తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.