TTD SUBMITS KARNATAKA CHOULTRIES TENDERS TO JUDICIAL PREVIEW COMMISSION _ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్‌కు కర్ణాటక సత్రాల టెండర్లు
Tirupati, 16 Mar. 21: TTD has submitted all tender papers of the Rs. 200 crores Karnataka Choultires Development Project for clearance by the Judicial Preview Commission.
The Judicial Preview Commission is expected to ensure transparency in the tender process by examining the suggestions and objections from the public, through the TTD website before granting permission.
TTD has allotted 7 acres and 5 cents of land on lease to Karnataka Choultries in Tirumala. The Karnataka Government has decided to take up development works in this land. The Karnataka Government has already deposited Rs.100 crore to take up the works with the support of TTD.
All the documents with regard to the project are uploaded on Monday, March 15 in the websites – https://judcialpreview.ap.gov.in and on www.tirumala.org
The public are invited to present their objections, if any, before 5pm of 23 March in the TTD website or by email to the Guntur based Judicial Preview Commission – Judge-jpp@ap.gov.in
The TTD will further commence the tender process after approval of the judicial preview commission.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్‌కు కర్ణాటక సత్రాల టెండర్లు
– 23వ తేదీలోగా అభ్యంతరాలు తెలిపే అవకాశం
తిరుపతి, 2021 మార్చి 16: తిరుమలలోని కర్ణాటక సత్రాల అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల వ్యయంతో టెండర్లు ఆహ్వానించడానికి సంబంధించిన పత్రాలను టీటీడీ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ కు పంపింది.
రూ.100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అన్ని ప్రాజెక్టుల టెండర్లను పరిశీలించడానికి ప్రభుత్వం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించడానికి జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ టెండర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
తిరుమలలో కర్ణాటక రాష్ట్ర సత్రాలకు 7 ఎకరాల 5 సెంట్ల భూమిని టిటిడి లీజుకు ఇచ్చింది. ఈ భూమిలో అభివృద్ధి పనులను చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అభివృద్ధి పనులు టిటిడి ఆధ్వర్యంలో చేపట్టడానికి కర్ణాటక ప్రభుత్వం టిటిడికి రూ.100 కోట్లు డిపాజిట్ చేసింది.
ఈ పనులకు సంబంధించిన టెండర్ పత్రాలను ఈ ఏడాది మార్చి 15వ తేదీన జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ “https://judcialpreview.ap.gov.in” లోను, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లో కూడా ఉంచబడ్డాయి. దీనిపై ఎవరికైన అభ్యంతరాలు ఉంటే 2021 మార్చి 23వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు గుంటూరులోని జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్‌కు చెందిన Judge-jpp@ap.gov.in మెయిల్ ఐడికి పంపవచ్చు.
పత్రాలు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత, పై పనిని చేపట్టడానికి టెండర్లు ఆహ్వానించబడతాయి.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.