KAMADHENU PUJA AT NARASARAOPETA ON JAN 15- ADDITIONAL EO _ జ‌న‌వ‌రి 15న న‌ర‌స‌రావుపేటలో కామ‌ధేనుపూజ : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 11 Jan. 21: After organising Dhanurmasa Lakshmi Deepotsavam in Kurnool during last week, TTD is all set to observe Kamadhenu Puja in a big way at Narasaraopet on the day of Kanuma on January 15.

TTD Additional EO Sri AV Dharma Reddy, held a review meeting on the arrangements for the holy event along with JEO Sri P Basanth Kumar at Sri Padmavati Rest House on Monday.

Later, disclosing the particulars to the media, he said the puja will be supervised by Sri Venkateswara Vedic University VC Acharya Sannidhanam Sudarshana Sharma. All departments were directed to make advance arrangements for the event and this will be as part of the propagation of Sanatana Hindu Dharma. The Go puja program will continue in both Telugu states on January 15.

He also directed the SVBC to prepare a documentary on the significance of Go puja.

TTD board members Sri Govindhari, Chief Engineer Sri Ramesh Reddy, SVBC CEO Sri Suresh Kumar, SEs Sri Venkateshwarlu, Sri Jagdiswar Reddy, SV Goshala Director Dr Harnath Reddy, HDPP Secretary Acharya Rajagopalan, and Annamacharya project Director Acharya Dakshinamurthy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జ‌న‌వ‌రి 15న న‌ర‌స‌రావుపేటలో కామ‌ధేనుపూజ :టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 11: ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా జ‌న‌వ‌రి 15వ తేదీన గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేటలో కామ‌ధేనుపూజ (గోపూజ‌) నిర్వ‌హించ‌నున్న‌ట్టు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో కామ‌ధేనుపూజ ఏర్పాట్ల‌పై సోమ‌వారం అద‌న‌పు ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి, ఇత‌ర పండితుల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని, ఇందుకు కావాల్సిన పూజాసామగ్రి త‌దిత‌రాల‌ను ముంద‌స్తుగా సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా జ‌న‌వ‌రి 15న తెలుగు రాష్ట్రాల్లో గోపూజ య‌థావిధిగా జ‌రుగుతుంద‌న్నారు. గోపూజ ప్రాశ‌స్త్యంపై ఎస్వీబీసీ ఆధ్వ‌ర్యంలో డాక్యుమెంట‌రీ రూపొందించాల‌ని ఆదేశించారు. కామ‌ధేనుపూజకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలన్నారు.

ఈ స‌మీక్ష‌లో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ గోవింద‌హ‌రి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌, ఎస్ఇలు శ్రీ వేంక‌టేశ్వర్లు, శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, శ్రీ టివి.స‌త్య‌నారాయ‌ణ‌, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.