GRAND CULMINATION OF ADHYAYNOTSAVAMS AT SRIVARI TEMPLE _ జ‌న‌వ‌రి 19న‌ ముగియనున్న అధ్యయనోత్సవాలు

Tirumala, 18 Jan. 20: The unique Vaikhanasa Agama festival of Adhyayanotsavams, which commenced at the Srivari temple on December 26, will be concluded in a grand fervour on January 19.

From the past 25 days, a team of Sri Vaishnava Jeeyangars have been performing Parayanam of pasuras from Nalayira Divya Prabandam compiled by the holy 12 Alwars. 

Everyday, the Jeeyangars chanted the 4000 pasuras at Ranganayakula mandapam in the Srivari temple.

It is said that on the first 11 days were tagged as Pagalpattu and next 10 days of Parayanam as Rapattu. Later on 22nd day, Kanninun Shirathambu, 23rd day as Ramanuja Nutramdadi and on 24th day Sri Varahaswami Sattumora were observed.

The 25th day event is described as Tannirmadu utsavam marking the grand finale of the holy annual event, which will be observed on Sunday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జ‌న‌వ‌రి 19న‌ ముగియనున్న అధ్యయనోత్సవాలు

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 18: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న అధ్య‌య‌నోత్స‌వాలు జ‌న‌వ‌రి 19వ తేదీ ఆదివారం ముగియ‌నున్నాయి. గ‌త ఏడాది డిసెంబ‌రు 26న ప్రారంభ‌మైన అధ్య‌య‌నోత్స‌వాలు 25 రోజుల పాటు జ‌రుగనున్నాయి.

ఈ సంద‌ర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ 25 రోజుల్లో ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని  4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు.

కాగా అధ్య‌య‌నోత్స‌వాల్లో తొలి 11 రోజుల‌ను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజుల‌ను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున‌ కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీ వరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్స‌వంతో ఈ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.