RELEASE OF PURANIC BOOKS ON JANUARY 28 AT ANNAMACHARYA KALA MANDIRAM _ జనవరి 28న అన్నమాచార్య కళామందిరంలో పురాణ గ్రంథాల ఆవిష్కరణ
Tirupati, 27 Jan. 21: Under the aegis of the TTD Purana Itihas project, a few publications of Puranic texts will be released on January 28 at Annamacharya Kala Mandiram at 5pm.
This included volumes of Matsya Maha Puranam, Vishnu Maha Puranam and Brahma Maha Puranam.
TTD is publishing all sacred and puranic texts of Astadasha Puranas in Telugu as part of its agenda to promote Sanatana Hindu dharma.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 28న అన్నమాచార్య కళామందిరంలో పురాణ గ్రంథాల ఆవిష్కరణ
తిరుపతి, 2021 జనవరి 27: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు పురాణ గ్రంథాలను ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా మత్స్య మహాపురాణం, విష్ణు మహాపురాణం, బ్రహ్మ మహాపురాణం గ్రంథాలను భక్తులకు అందుబాటులోనికి తీసుకురానున్నారు.
సనాతన ధర్మప్రచారంలో భాగంగా పురాణ ఇతిహాసాలను జనబాహుళ్యంలోకి తీసుకురావడం ద్వారా అందులోని ధర్మసూత్రాలను నేటి తరానికి తెలియజేసేందుకు టిటిడి అష్టాదశ పురాణాలను తెలుగులో అనువదించి ముద్రిస్తున్నది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.