EIGHTH EDITION OF SUNDARAKANDA AKHANDA PARAYANA ON JAN 2 _ జ‌న‌వ‌రి 2న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 8వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 29 Dec. 20: In pursuit of its noble goal to relieve the humanity from the pandemic of Covid 19, TTD is organising the Eighth edition of Sundarakanda Akhanda Parayanam at Nada Neeranjanam on January 2.

Nearly 200 Vedic scholars from Dharmagiri Veda Vijnana Peetham, SV Vedic University and National Sanskrit University and others will commence chanting 195 shlokas fron 31-35 sargas of Sundarakanda.         

The TTD appealed to devotees to participate in the parayanam at their homes by watching the live telecast of the unique program in the SVBC channel between 7am and 9am on Sunday, January 2.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

జ‌న‌వ‌రి 2న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 8వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2020 డిసెంబ‌‌రు 29: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌న‌వ‌రి 2వ తేదీన 8వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

ఆదివారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న 195 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.