SAPTHAGIRI MAGAZINE DELIVERY ISSUES TO BE RESOLVED SOON-TTD EO _ టిటిడిపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు : డయల్ యువర్ ఈవోలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
Tirumala, 2 Apr. 21: The issues related to Sapthagiri magazine of TTD including the delay in Postal delivery, will be resolved soon, said TTD EO Dr KS Jawahar Reddy.
While attending to various pilgrim callers as part of Dial your EO programme held at Conference Hall in TTD Administrative Building on Friday, the TTD Administrative Chief attended to 22 Callers across the country in this one hour live Phone-in that was carried out between 9am and 10am.
Answering to the queries of pilgrim callers, the EO said, there are some issues with respect to postal delivery of Sapthagiri Magazine of TTD and assured the callers that they will be sorted out soon.
When a caller Appanna from Visakhapatnam sought EO to strongly counter and punish the false propaganda against TTD by some vested interests on Social Media, the EO replied to him that the Vigilance and IT wings of TTD is responding immediately to counter the rumours against TTD. He also said, TTD is levying cases against those who are trying to tarnish the image of TTD with ulterior motives.
When the same caller asked EO to set up the Agama Advisory Committee to which EO said will be constituted soon.
One Caller Sri Venkat from Peethapuram brought to the notice of EO about the poor maintenance of cottages in Tirumala to which he replied as TTD has taken up repair works of majority of Cottages in Tirumala, some problems are there which will be rectified in next couple of months. He also said, TTD is also contemplating to simplify the cottage allotment to pilgrim by sending an SMS to his or her registered mobile number with the specified name of sub-enquiry
Office so that the pilgrim shall directly go to that office and collect his room keys instead of wasting time at CRO.
The EO also said, the Call Centre of TTD will also be strengthened soon to give better services to pilgrims. “A five digit toll-free number will be allotted soon for the benefit of pilgrim callers”, he added.
Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, SVBC CEO Sri Suresh Kumar and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడిపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు : డయల్ యువర్ ఈవోలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుమల, 02 ఏప్రిల్ 2021: సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని టిటిడిపై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. అప్పన్న – వైజాగ్
ప్రశ్న: టిటిడిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోండి ? ఆగమ సలహామండలిని పునరుద్ధరించండి?
ఈవో : సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై టిటిడికి సంబంధించిన వాస్తవ విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న వారి ఐపి అడ్రసులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడుతున్నాం. తలనీలాలకు సంబంధించి కూడా వెంటనే స్పందించాం. అస్సాం రైఫిల్స్ బలగాల నుండి నివేదిక తెప్పించి మీడియాకు విడుదల చేశాం. ఈ విషయంపై టిటిడిపై అభాండాలు వేసిన ఒక మాజీ ప్రజాప్రతినిధికి పరువునష్టం నోటీసులు అందజేశాం. ఇలాంటి దుష్ప్రచారాన్ని భక్తులెవరైనా గుర్తిస్తే టిటిడి కాల్ సెంటర్‌కు సమాచారం అందించాలని కోరుతున్నాం. డిసెంబరులో ఆగమ సలహామండలి గడువు పూర్తయింది. త్వరలో పునరుద్ధరిస్తాం.
2. వెంకట్ – పిఠాపురం
ప్రశ్న: ఎస్వీబీసీలో అడ్వర్టైజ్‌మెంట్లు వస్తూనే ఉన్నాయి. విరాళాల గురించి ప్రచారం ఎక్కువగా ఉంది. తిరుమలలో గదుల్లో శ్రీవారి ఫొటో తిరిగి పెట్టండి. పరిశుభ్రత పెంచండి?
ఈవో : ఎస్వీబీసీలో యాడ్స్ తగ్గించాం. స్పాన్సర్‌షిప్ చేసిన వారి గురించి మాత్రమే చెబుతున్నాం. విరాళాల ప్రచారం తగ్గిస్తాం. మే నెల నాటికి తిరుమలలో అన్ని గదుల్లో మరమ్మతులు పూర్తి చేస్తాం. పారిశుద్ధ్యం, ఇతర సమస్యలపై యాత్రికులు ఫిర్యాదు చేసేందుకు ఎఫ్ఎంఎస్ టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచి వెంటనే పరిష్కరిస్తాం.
3. సత్యనారాయణ – రాజమండ్రి
ప్రశ్న: తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల పొందినవారికి రెండు రోజుల తరువాత దర్శనం ఇవ్వడం ఇబ్బందికరంగా ఉంది?
ఈవో : ఈ విషయం ఇదివరకే భక్తులందరికీ తెలిసేలా ప్రచారం చేశాం. ప్రస్తుతం ఒక రోజు తరువాతే దర్శనం లభిస్తోంది.
4. ప్రభాకర్ – బెంగళూరు
ప్రశ్న: తిరుమల కొండ ప్రాంతంలో ప్రకృతి నడుమ ధ్యానం చేసేందుకు వీలుగా ధ్యానమందిరం నిర్మించండి?
ఈవో : తిరుమలలో ఆస్థానమండపం వద్ద ధ్యానమందిరం ఉంది.
5. నమ్రత – బెంగళూరు
ప్రశ్న: 12 ఏళ్ల ముందు విశేషపూజ బుక్ చేసుకున్నాం. ఇప్పడు ఆ సేవకు బదులుగా బ్రేక్ దర్శనం లేదా రీఫండ్ పొందాలని లేఖ పంపారు?
ఈవో : స్వామివారి ఉత్సవమూర్తులను పరిరక్షించడంలో భాగంగా అభిషేకాలు తగ్గించాలని, ఇందుకోసం వారపు సేవలుగా ఉన్న విశేషపూజ, సహస్రకళశాభిషేకం ఏడాదికోసారి నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.
6. శంకరరావు – వినుకొండ
ప్రశ్న: అన్నదానానికి ఒక లక్ష విరాళమిచ్చాను. ఇప్పుడు దర్శనానికి రావచ్చా?
ఈవో : దాతలు ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకుని దర్శనానికి రావచ్చు.
7. సీతారాములు – విజయవాడ
ప్రశ్న: సుందరకాండ బాగుంది. దర్శన క్యూలైన్‌లో తోపులాట జరుగుతోంది. నాదనీరాజనం కార్యక్రమాల్లో సౌండ్ సిస్టమ్ సరిగా లేదు?
ఈవో : తోపులాట జరుగకుండా చూస్తాం. నాదనీరాజనం వేదికపై సౌండ్ సిస్టమ్‌ను పూర్తిగా మారుస్తాం.
8. వాణిశ్రీ – హైదరాబాద్
ప్రశ్న: మార్చి 23న తిరుమలకు వచ్చాం. కోవిడ్ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నం పలుకులుగా ఉంది.?
ఈవో : తిరుమలలో శ్రీవారి ఆలయం సహా అన్ని ప్రాంతాల్లో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు చేస్తున్నాం. అన్నప్రసాద భవనంలో భక్తుల ఫీడ్‌బ్యాక్ తీసుకుని నాణ్యత పెంచుతాం.
9. జయంతి – హిందూపూర్, హేమలత – పొన్నూరు
ప్రశ్న: సప్తగిరి మాసపత్రికకు ఆన్‌లైన్‌లో చందా కట్టే అవకాశం కల్పించండి. సప్తగిరి మాసపత్రిక సరిగా రావడం లేదు. ఎస్వీబీసీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రసారం చేయండి?
ఈవో : సప్తగిరి మాసపత్రికకు ఆన్‌లైన్‌లో చందా కట్టే అవకాశం కల్పిస్తాం. పత్రిక సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటాం. కంటెంట్ చక్కగా ఉండేలా, పత్రిక ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎస్వీబీసీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేస్తాం. సంకీర్తనలకు అర్థాలు తెలియజేసే కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రసారం చేస్తాం.
10. అమరనాథ్ – నాగలాపురం
ప్రశ్న: రథసప్తమి రోజు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు గదులు దొరక్క చాలా ఇబ్బందిపడ్డారు?
ఈవో : కోవిడ్ కారణంగా చాలారోజుల తరువాత స్వామివారి వాహనసేవలు మాడ వీధుల్లో జరగడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. 2, 3 రోజుల ముందు గదులు పొందినవారు వాటిని ఖాళీ చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
11. ప్రకాష్ – నగరి
ప్రశ్న: టిటిడిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు ఆన్‌లైన్‌లో పెట్టండి ?
ఈవో : జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లోపు ఉన్న ఉద్యోగాల భర్తీలో స్థానికులకు 75 శాతం అవకాశం కల్పించాలని బోర్డు తీర్మానించి ప్రభుత్వ అనుమతికి పంపాం. ఎక్కువ మంది భక్తుల సౌకర్యం కోసమే సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నాం.
12. తారకరామకృష్ణ – అనకాపల్లి
ప్రశ్న: రూ.300/- టికెట్లు బుక్ చేసుకుని రాలేకపోయిన వారికి కనీసం ప్రసాదం పంపే ఏర్పాటు చేయండి?
ఈవో : పోస్టల్‌లో ప్రసాదాలు పంపితే పాడయ్యే అవకాశముంది.
13. శాంతి – మంగళగిరి
ప్రశ్న: ఏప్రిల్ 16న శ్రీవారి సేవకు బుక్ చేసుకున్నాం. రావచ్చా?
ఈవో : తిరుమలలో కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. వ్యాక్సినేషన్ వేయించుకుని వస్తే బాగుంటుంది.
14. శ్రీనివాస్ – నెల్లూరు
ప్రశ్న: తిరుమలలోని హోటళ్లలో ధరల పట్టికలో సూచించిన దానికంటే రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు? ఆలయంలో సిబ్బంది ప్రవర్తన సరిగా ఉండడం లేదు.
ఈవో : హోటళ్లలో ధరలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. భక్తులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచుతాం. శ్రీవారి ఆలయంలో సిబ్బంది ప్రవర్తన మెరుగుపరిచేందుకు శిక్షణ ఇస్తాం.
15. గీతానాథ్ – చెన్నై
ప్రశ్న: దాదాపు రూ.15 లక్షలు విరాళం ఇచ్చాం. దాతల ప్రయోజనాలు పొందడమెలా?
ఈవో : మీకు ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తాం.
16. లక్ష్మీనారాయణ – రాజమండ్రి
ప్రశ్న: ఎస్వీబీసీలో శతమానంభవతి కార్యక్రమం ప్రసారానికి సంబంధించి భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వండి. భక్తులకు ఆశీర్వచనంతో పాటు ప్రసాదం పంపండి?
ఈవో : పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.
17. కనకమ్మ – రాజమండ్రి
ప్రశ్న: విఐపి దర్శనంలో కూడా తోసేస్తున్నారు ?
ఈవో : అలా జరుగకుండా చూస్తాం.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ చంద్రశేఖర్, విజివో శ్రీ మనోహర్, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.