LAND COMMITTEE LAUDS TTD FOR ITS PROTECTIVE MECHANISM OF DONATION LANDS _ టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు : ల్యాండ్ క‌మిటీ ఛైర్మ‌న్ జ‌స్టిస్‌ కె.శ్రీ‌ధర్ రావు

Tirupati, 21 June 2022: Retired Judge Justice Sri K Sridhar Rao, the Chairman of the TTD Land Committee complimented the TTD for its efforts towards the preservation of lands donated by devotees all over the country.

Speaking during a meeting by the Land Committee at Sri Padmavati Rest House in Tirupati on Tuesday Retired Judge Justice Sri K Sridhar Rao, the Chairman of the TTD Land Committee has lauded the efforts of the TTD Estate Wing led by Special Officer Sri Mallikarjuna under the instructions of JEO (H&E) Smt Sada Bhargavi in implementing all suggestions of the land committee in preserving 975 assets across the country.

He said since the first meeting of the land committee on January 21 of 2021 the TTD officials have successfully recovered properties worth ₹23 crores spread over 20.45 acres. The TTD has earned a lease amount of ₹4.15 crores from 29 properties. He said the meeting also discussed on development of properties in Janakpuri, Rishikesh and Dehradun for benefit of devotees.

The Chief of the Committee was in all praise for TTD which is contemplating digitalisation of its land properties for more administrative ease and transparency with the help of modern technology like Geo Mapping, Geo Fencing etc.

Among other recent achievements by TTD Estates Wing, the leasing of all Kalyana Mandapams has brought TTD a revenue of ₹ 6 crore. The task force has also succeeded to take back a 6-acre property in Kabisthalam at Tanjore in Tamil Nadu that has been pending for several decades.

Land committee members included Dr VR Gauri Shankar, Hyderabad local advisory committee Chairman Sri GV Bhaskar Rao, Chennai local advisory committee chairman Sri AJ Shekar, Mumbai local advisory committee chairman Sri Amol Kale, Bangalore local advisory committee chairman Dr Sampat Ravi Narayana, New Delhi local advisory committee chairperson Smt V Prashanti Reddy, Bhubaneswar local advisory committee chairman Sri Dushyant Kumar Das who participated virtually while social activist Sri Bayya Srinivasulu, Dr K Ramachandra Murthy and Sri Govind Hari were also present in the meeting.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు : ల్యాండ్ క‌మిటీ ఛైర్మ‌న్ జ‌స్టిస్‌ కె.శ్రీ‌ధర్ రావు

జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వితో పాటు ఎస్టేట్ విభాగం అధికారులకు క‌మిటీ ప్ర‌శంస‌లు

తిరుపతి, 2022, జూన్‌ 21: తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి భ‌క్తులు కానుక‌లుగా స‌మ‌ర్పించిన దేశవ్యాప్తంగా గ‌ల టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని టిటిడి ఏర్పాటుచేసిన ల్యాండ్ క‌మిటీ ఛైర్మ‌న్, రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్‌ కె.శ్రీ‌ధర్ రావు తెలిపారు. జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి నేతృత్వంలో ఎస్టేట్ విభాగం ప్ర‌త్యేకాధికారి శ్రీ మ‌ల్లికార్జున, ఇత‌ర అధికారులు క‌మిటీ సూచ‌న‌ల‌ను ప‌క్కాగా అమ‌లుచేశార‌ని, దేశ‌వ్యాప్తంగా గ‌ల 975 ఆస్తుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని ప్ర‌శంసించారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో మంగ‌ళ‌వారం ల్యాండ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్‌ కె.శ్రీ‌ధర్ రావు మాట్లాడుతూ 2021 జ‌న‌వ‌రి 21న క‌మిటీ మొద‌టి స‌మావేశం జ‌రిగింద‌న్నారు. ఈ ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం కాలంలో 29 ప్రాంతాల్లో ఆక్ర‌మ‌ణ‌కు గురైన రూ.23 కోట్ల విలువైన‌ 20.45 ఎకరాల‌ను టిటిడి అధికారులు స్వాధీనం చేసుకున్నార‌ని తెలిపారు. మొత్తం 109 ఆస్తుల‌ను లీజుకు ఇవ్వ‌డం ద్వారా టిటిడికి రూ.4.15 కోట్ల ఆదాయం స‌మ‌కూరింద‌న్నారు. జ‌న‌క్‌పురి, రిషికేష్‌, డెహ్రాడూన్‌ త‌దిత‌ర దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అభివృద్ధి చేసి భ‌క్తుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డేలా చేయాల‌నే విష‌యంపై స‌మావేశంలో చ‌ర్చించామ‌ని తెలిపారు. ఆస్తుల‌న్నింటికీ జియో మ్యాపింగ్ చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, త‌ద్వారా సులువుగా గుర్తించ‌డంతోపాటు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా చూడ‌వ‌చ్చ‌ని అన్నారు. క‌ల్యాణ‌మండ‌పాల‌ను ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ(EOI) ద్వారా లీజుకు ఇవ్వ‌డం ద్వారా రూ.6 కోట్ల ఆదాయం ల‌భించింద‌న్నారు. టిటిడి ఆస్తుల‌కు ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టి ప‌ర్య‌వేక్షించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాల‌ను ఏర్పాటుచేశామ‌న్నారు. త‌మిళ‌నాడులోని తంజావూరు జిల్లా క‌పిస్థ‌లం ప్రాంతంలో వందేళ్ల క్రితం భ‌క్తుడు కానుక‌గా స‌మ‌ర్పించిన 6 ఎక‌రాల స్థ‌లాన్ని ఇటీవ‌ల టిటిడి స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు.

ఈ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులు డా. విఆర్‌.గౌరీశంక‌ర్‌, హైద‌రాబాద్ స్థానిక స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ శ్రీ జివి.భాస్క‌ర్‌రావు, చెన్నై స్థానిక స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ శ్రీ ఎజె.శేఖ‌ర్‌, ముంబ‌యి స్థానిక స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ శ్రీ అమోల్ కాలే, బెంగ‌ళూరు స్థానిక స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ డా. సంప‌త్ ర‌వినారాయ‌ణ‌, న్యూఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ శ్రీ‌మ‌తి వి.ప్ర‌శాంతిరెడ్డి, భువ‌నేశ్వ‌ర్ స్థానిక స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ శ్రీ దుష్మంత్‌కుమార్ దాస్‌, శ్రీ బ‌య్యా శ్రీ‌నివాసులు, డా. కె.రామ‌చంద్ర‌మూర్తి, శ్రీ గోవింద‌హ‌రి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.