JEO (H & E) INSPECTS TTD EMPLOYEES SPORTS MEET ARRANGEMENTS _ టిటిడి ఉద్యోగుల క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు
TIRUPATI, 24 JANUARY 2023: The JEO for Health and Education Smt Sada Bhargavi on Tuesday evening, inspected SV High School Grounds to verify the arrangements for TTD Employees annual Meet which is scheduled between February 2 to 18.
She directed the officials to arrange Shelter, breakfast, drinking water, parking, etc. to the participants.
DyEO Welfare Smt Snehalata, SE Electrical Sri Venkateswarulu, DEO Sri Bhaskar Reddy, SV College of Music and Dance Principal Sri Sudhakar and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఉద్యోగుల క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు
ఎస్వి హై స్కూల్ మైదానాన్ని పరిశీలించిన జెఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2023 జనవరి 24: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ఎస్వి హై స్కూల్ మైదానాన్ని మంగళవారం జెఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ఫిబ్రవరి 2న ప్రారంభమై 18వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా షెల్టర్లు, కుర్చీలు, త్రాగునీరు, అల్పాహారము, భోజనము, మరుగుదొడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం వార్షిక క్రీడా పోటీలు నిర్వహించే ఎస్వీ హై స్కూల్ మైదానాన్ని జెఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈవో వెంట డిప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఎస్ఇ (ఎలక్ట్రికల్ ) శ్రీ వెంకటేశ్వర్లు, డీఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, ఎస్వి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సుధాకర్, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.