SPORTS IMPROVE MENTAL AND PHYSICAL FITNESS- TTD JEO BHARGAVI _ టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం

Tirupati, 30 August 2021: Sports promote mental and physical fitness to reduce work stress and also enable employees to serve Srivari devotees with more enthusiasm said TTD Joint Executive Officer Smt Sada Bhargavi.

Participating in the grand valedictory event of the TTD employees annual sports meet- 2021 at Mahati auditorium, TTD JEO said as an institution TTD was committed towards employees welfare and exhorted everyone to engage in some sort of sports or physical activity to promote health and liveliness in their daily chores.

She lauded women employees who participated in equal spirits during the annual sports events held in adherence to Covid norms from February 21 to March 14 this year.

TTD JEO also distributed prizes to children of employees who participated in cultural contests conducted as part of the annual sports meet TTD PRO Dr T Ravi, Dyeo(Welfare) Sri Ananda Raju, Dyeo HR Sri Govindarajan also distributed the Prizes to winners and runners of various sports events which included 475 first prizes, 400-second prizes and 84 third prizes. In all 855 employees and retired persons had participated in the annual sports of which 555 were men and 300 were women.

80-year-old retired employees become role model sports persons

It is a matter of pride that 80 plus retired employees had participated in the annual sports this year also and become icons of sports promotion by TTD. They included Retd. Physical Director Smt Pushpa Kumari (84) and Smt Nirmala Krishnan who had excelled in ball badminton and shuttle events this year.

Earlier physical director of SP Mahila Degree and PG college Smt Usha Rani read the annual report of the TTD annual sports event and Dr Krishnaveni HoD of Telugu Department presented the valedictory message. Senior TTD officials and employees, sport participants were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క్రీడలతోనే శారీరక, మానసిక ప్రశాంతత : జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2021 ఆగ‌స్టు 30: ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించడానికి, మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా భక్తులకు విశేష రీతిలో సేవలు అందించడానికి క్రీడలు దోహదపడతాయని టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి పేర్కొన్నారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం సోమ‌వారం ఉద‌యం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం టిటిడి కట్టుబడి ఉందని, ఇందుకోసం అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఉద్యోగులు ప్రతిరోజూ దైనందిన జీవనంలో కొంత సమయం ఏదో ఒక క్రీడను సాధన చేయాలని, దీనివల్ల శారీరక ఆరోగ్యంతోపాటు విధుల్లోనూ చురుగ్గా ఉంటారని అన్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21 నుండి మార్చి 14వ తేదీ వ‌ర‌కు కోవిడ్ – 19 నిబంద‌న‌లు పాటిస్తూ ఉద్యోగులు ఉత్సాహంగా క్రీడ‌ల్లో పాల్గొన్నార‌న్నారు. పురుష ఉద్యోగుల‌తో స‌మానంగా మ‌హిళ ఉద్యోగులు క్రీడ‌ల్లో పాల్గొన‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలకు సాంస్కృతిక పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

కాగా, వివిధ క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జెఈవో, టిటిడి ప్ర‌జా సంబంధాల అధికారి డా.టి.ర‌వి, సంక్షేమాధికారి శ్రీ ఆనంద‌రాజు, డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఉద్యోగుల్లో మొత్తం 475 మంది ప్రథమ, 400 మంది ద్వితీయ, 84 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు. మొత్తం వివిధ విభాగాల్లో 855 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 555 మంది పురుషులు, 300 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

ఉద్యోగుల్లో క్రీడా స్పూర్తి నింపిన 80 సంవ‌త్స‌రాల పైబ‌డిన విశ్రాంత మ‌హిళ ఉద్యోగులు

ప్ర‌తి ఏడాది టిటిడి వార్షిక క్రీడ‌ల్లో 80 సంవ‌త్స‌రాల పైబ‌డిన విశ్రాంత ఉద్యోగులు ఎంతో ఉత్స‌హంగా పాల్గొని ఉద్యోగుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. విశ్రాంత ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్లు శ్రీ‌మ‌తి పుష్ప‌కుమారి (84 సం||రాలు), శ్రీ‌మ‌తి నిర్మ‌ల క్రిష్ణ‌న్ ( 83 సం||రాలు) బాల్‌ బ్యాడ్మింటన్‌, షటిల్‌లో విజ‌యం సాధించారు.

అంతకుముందు టిటిడి వార్షిక క్రీడా పోటీల నివేదికను శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ డిగ్రీ, పిజి క‌ళాశాల ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఉషారాణి వివరించగా, తెలుగు విభాగాదిప‌తి డా.క్రిష్ణ‌వేణి ముగింపు సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.