ALL SET FOR ANNUAL SPORTS MEET IN TTD _ టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలకు ఏర్పాట్లు పూర్తి

TIRUPATI, 01 FEBRUARY 2023: All arrangements were completed to organise the annual Sports Meet for the employees of TTD from February 2 to 19.

 

The event will commence at the Parade Grounds in TTD Administrative Building in Tirupati by 10:30am on February 2.

 

Besides the Parade Grounds, Recreation Hall, the grounds of SV High School, SV Junior college, SV Arts College and Srinivasa Sports Complex will be utilised to organise various forms of Games and Sports to the women and men employees, retired employees of TTD in various age categories.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలకు ఏర్పాట్లు పూర్తి

– ఫిబ్రవరి 2న పరిపాలనా భవనం మైదానంలో ప్రారంభం

తిరుపతి, ఫిబ్రవరి 01, 2023: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్‌ మైదానంలో క్రీడల ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరుగనున్నాయి.

ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, ఎస్వీ హైస్కూల్ మైదానం, ఎస్వీ జూనియర్ కళాశాల మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానం, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు. టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ శ్రీమతి స్నేహలత క్రీడల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.