JEO H &E INSPECTS TTD SCHOOLS _ టిటిడి పాఠశాలల్లో కోవిడ్-19 మార్గదర్శకాల అమలును పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 6 Nov. 20: The JEO for Health and Education Smt Sada Bhargavi inspected TTD run schools at Tirumala and in Tirupati to verify Covid guidelines being followed in these institutions.
As part of her inspection on Friday she visited SV High School at Tirumala, Kodandarama High School, SP Girls High School and SV High School at Tirupati.
She instructed the concerned In-charges of the schools to follow the norms without deviation and also verified the mid day meals being served to students by ISKCON.
DEO Sri Ramana Prasad was also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
టిటిడి పాఠశాలల్లో కోవిడ్-19 మార్గదర్శకాల అమలును పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020, నవంబరు 06: టిటిడి పాఠశాలల్లో కోవిడ్-19 మార్గదర్శకాలు, మధ్యాహ్న భోజనం అమలుతీరును జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు.
తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్, శ్రీ కోదండరామ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, శ్రీ పద్మావతి గర్ల్స్ హైస్కూళ్లను జెఈవో సందర్శించారు. పాఠ్యాంశాల బోధన, రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్-19 మార్గదర్శకాల అమలును పరిశీలించి ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇస్కాన్ అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.
జెఈఓ వెంట టిటిడి విద్యాశాఖాధికారి డా. ఆర్.రమణప్రసాద్ ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.