TTD MULLS MONTH LONG “KARTHIKA MASA MAHA VRATA DEEKSHA” _ టీటీడీ నేతృత్వంలో కార్తీక మాస మహావ్రత దీక్ష

SVBC TO LIVE TELECAST ALL THE EVENTS FROM NOV 16 TO DEC 14

Tirumala, 6 Nov. 20: After successfully taking forward many live spiritual programmes across the globe through SVBC, TTD is mulling yet another mega religious event in the auspicious month of Karthika scheduled from November 16 till December 14 for the first time as “Karthika Masa Maha Vrata Deeksha”. 

The SVBC Board Meeting held under the Chairmanship of Sri YV Subba Reddy held at Annamaiah Bhavan in Tirumala on Friday along with EO Dr KS Jawahar Reddy, discussed on several issues related to the channel with a special focus on the upcoming events which are lined up to be telecast live on SVBC. 

Additional EO and SVBC MD Sri AV Dharma Reddy, CEO Sri Suresh Kumar briefed on all the activities related to SVBC and a series of programmes which are under pipeline. FACAO Sri O Balaji was also present.

Some important resolutions:

* To live telecast month long event which will be conducted by TTD during the ensuing Karthika Month and the entire event will be titled as Karthika Masa Maha Vrata Deeksha

* Events includes Karthika Purana Pravachanam, Karthika Masa Vratam, Karthikamasa Rudrabhishekam, Karthika Vana Samaradhana, Karthika Maha Deepotsavam will be telecast live on SVBC during the entire month

* Considerable viewership increase for SVBC for the programmes Sundarakanda, Bhagavat Gita and Virataparvam

* Proposals for Licence to be sent to Ministry of Information and Broad Casting for SVBC Kannada and Hindi Channels which will be launched likely in February

* Plans underway to make SVBC an Ad free High Definition Channel 

  ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ నేతృత్వంలో కార్తీక మాస మహావ్రత దీక్ష –

ఎస్వీబీసీ లో నెల రోజులూ ప్రత్యక్ష ప్రసారం –

తిరుమల, 2020 న‌వంబ‌రు 06.: లోక కళ్యాణార్థం అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీటీడీ భగవత్ సంకల్పంతో తొలిసారి కార్తీక మాసం మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా హిందూ సమాజంలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు దోహద పడతాయని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పాలక మండలి అభిప్రాయపడింది.

తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఎస్వీబీసీ 55వ పాలక మండలి సమావేశం జరిగింది.

ఇందులోని ముఖ్యాంశాలు ఇవీ.

– సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ నవంబరు 16 నుంచి డిసెంబరు 14 వ తేదీ వరకు ప్రతి రోజు టీటీడీ నిర్వహించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం వీక్షకులను ఆకట్టుకునేలా ప్ర‌సారం చేయాలి.

– కార్తీక మాసంలో ఏ రోజు ఏ వ్రతం ఎలా చేయాలి, వాటి ఫ‌లితాలు, ఇందుకు సంబంధించిన ప్ర‌వ‌చ‌నాలు, వ్యాఖ్యానాలు వీక్ష‌కులను ఆకట్టుకునేలా రూపొందించాలి.

— కార్తీకమాస రుద్రాభిషేకం, కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన మహోత్సవం, కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్వీబీసీ అధికారులకుఆదేశం 

– ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లు ఫిబ్రవరిలో ప్రసారాలు ప్రారంభించడానికి ప్రాథమికంగా నిర్ణయం.

— ఇందుకోసం కేంద్ర సమాచార ప్రసారశాఖ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలని సీఈఓ కు ఆదేశం.

— ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత కార్యమాలకు అద్భుతమైన రేటింగ్స్ రావడంపై అభినందన.

– ఎస్వీబీసీని హెచ్ డి ఛానల్ చేయాలి –

సమావేశంలో ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఎస్వీబీసీ ఎండి శ్రీ ధర్మారెడ్డి, ఎఫ్ ఏ అండ్ సీఓ శ్రీ బాలాజీ, సి ఈ ఓ శ్రీ సురేష్, ఆచార్య రాణి సదాశివమూర్తి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది