EO INSPECTS ALL PROJECTS _ టిటిడి ప్రాజెక్టులను పరిశీలించిన ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
Tirupati 15 Dec. 20: TTD EO Dr KS Jawahar Reddy on Tuesday inspected all projects in SVETA Bhavan located in Tirupati.
During his inspection at Central Library, he verified the books printed and published with TTD financial assistance, children’s books, spiritual magazines, books on Vedas, philosophy, linguistics etc.
Later he paved a visit to the online classes being conducted to employees and also visited HDPP, Dasa Sahitya, SV Higher Vedic Studies, Pura Ithihasa, SV Vaibhavotsava, Alwar Divya Prabandha, Dravida Veda Nalayira Divya Prabandha projects and their functions.
JEO Health and Education Smt Sada Bhargavi, HDPP Chief Sri Rajagopalan, Dasa Sahitya Project Special Officer Sri Anands Theerthacharya, Annamacharya Project Director Sri Dakshinamurty, SVETA Director Sri Ramanjulu Reddy, Kalyanam Project Chief Sri Satya Gopal, Higher Vedic Studies In Charge Dr Vibhishana Sharma, AEO Smt Jagadeeswari were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ప్రాజెక్టులను పరిశీలించిన ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుపతి, 2020 డిసెంబరు 15: టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి మంగళవారం తిరుపతిలోని శ్వేత భవనంలో గల కేంద్రీయ గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, పలు ప్రాజెక్టులను పరిశీలించారు.
గ్రంథాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో టిటిడి ప్రచురణలు, టిటిడి ఆర్థిక సాయంతో ముద్రించిన పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఆడియో విజువల్ సామగ్రి, మొదటి అంతస్తులో ఉన్న వేద సాహిత్యం, తత్వశాస్త్రం, ఇతిహాసాలు, సాహిత్యం , భాషాశాస్త్ర గ్రంథాలను పరిశీలించి వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్వేత భవనంలో టిటిడి ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులను పరిశీలించారు. ఆదేవిధంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ద్రవిడ వేద నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకం, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ, శ్రీనివాస కల్యాణం , ఎస్వీ వైభవోత్సవం ప్రాజెక్టులను తనిఖీ చేశారు. ఆయా ప్రాజెక్టుల కార్యకలాపాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈఓ వెంట టిటిడి జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, శ్వేత సంచాలకులు డా. కె.రామాంజులరెడ్డి, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ గోపాల్, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఏఈవో శ్రీమతి జగదీశ్వరి ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.