ALL TTD DHARMIC PROJECTS TO BE MERGED IN HDPP- TTD EO _ టిటిడి ప్రాజెక్టుల‌న్నీ ఇక‌ హెచ్‌డిపిపిలోకి

Tirupati, 6 Apr. 21: With a view to strengthen the Sanatana Hindu Dharma Prachara programme in a big way, all Dharmic Projects in TTD will be merged under the Umbrella of HDPP.

Addressing a review meeting of Senior Officers at the TTD Administrative Building on Tuesday in Tirupati the TTD EO said the merger of the Annamacharya project, Dasa Sahitya project, Alwar Divya Prabandam project with HDPP is for the promotion of unified research for achieving the goal of Sanatana Hindu dharma propagation.

He also urged officials to redesign and reposition the Sapthagiri monthly magazine to attract devout readers.

With regard to Medicare procurement at all hospitals, the TTD EO also advised officials to follow a coordinated centralised purchase policy.

He suggested the JEO to infuse several changes in the present employees training system at the SVETA Bhavan and to introduce a mandatory 2 months crash course for all employees to improve their work skills with cadre-based training modules.

He also suggested an increase in caller agents numbers at the Call Centre with state of art technology and for formulating a complaint management application to assist the HODs of all TTD wings to resolve devotees issues.

He also advised all HoDs to reduce old files and old furniture physical presence in their surroundings and keep their wok place clean and appealing.

He said henceforth all service wings should be named as HR and a committee with JEO, DyEO (services) be set up to work out an action plan for the reorganisation of all sections.

The TTD EO also reviewed on the Accommodation management system, strengthening of the reception wing, FMS redressal system and others.

Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri M Ramesh Reddy, FA&CAO Sri O Balaji, SVIMS Director Dr B Vengamma and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ప్రాజెక్టుల‌న్నీ ఇక‌ హెచ్‌డిపిపిలోకి

ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసేందుకే ఈ నిర్ణ‌యం

టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2021 ఏప్రిల్ 06: టిటిడిలోని ప్రాజెక్టుల‌ను హిందూ ధ‌ర్మ‌ప్రచార ప‌రిష‌త్‌లో విలీనం చేసి మ‌రింత ముమ్మ‌రంగా ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వనంలో గ‌ల స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు త‌దిత‌ర ప్రాజెక్టుల‌న్నీ వేరువేరుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నార‌‌న్నారు. ఈ ప్రాజెక్టుల‌ను హెచ్‌డిపిపిలో విలీనం చేసి ప‌రిశోధ‌న‌, కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌‌, ముద్ర‌ణ‌, ప్ర‌చారం ఉప విభాగాలను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ ఉప విభాగాలు త‌మ‌కు కేటాయించిన విధులు నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని, త‌ద్వారా ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే సౌల‌భ్యం ఉంటుంద‌ని అన్నారు. అదేవిధంగా, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌ పాత సంచిక‌ల‌ను డిజిటైజ్ చేయాల‌ని ఆదేశించారు.

టిటిడికి అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల మందుల‌ కొనుగోలుకు కేంద్రీకృత విధానాన్ని అనుస‌రించాల‌ని ఈవో సూచించారు. శ్వేత భ‌వ‌నంలో ఉద్యోగుల‌కు ఇస్తున్న శిక్ష‌ణ‌లో ప‌లు మార్పులు తీసుకురావాలన్నారు. ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచేందుకు అనుగుణంగా కొత్త‌గా విధుల్లో చేరే ఉద్యోగుల‌కు రెండు నెల‌ల పాటు శిక్ష‌ణ‌ను త‌ప్ప‌నిస‌రి చేయాలని, క్యాడ‌ర్ వారీగా శిక్ష‌ణ మాడ్యూళ్ల‌ను త‌యారు చేయాల‌ని జెఈవోకు సూచించారు. కాల్ సెంట‌ర్‌లో కాల‌ర్ ఏజంట్ల సంఖ్య‌ను మ‌రింత పెంచాల‌ని, అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల నుండి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు, ఫిర్యాదుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా విభాగాధిప‌తుల‌కు చేర్చి ప‌రిష్క‌రించేందుకు వీలుగా కంప్లైంట్ మేనేజ్‌మెంట్ అప్లికేష‌న్‌ను తీసుకురావాల‌న్నారు. విభాగాల వారీగా పాత ఫైళ్లు, పాత ఫ‌ర్నీచ‌ర్‌ను త‌గ్గించుకోవాల‌ని, కార్యాల‌యాల ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. సేవ‌ల విభాగాన్ని హెచ్ఆర్ విభాగంగా పిల‌వాల‌ని, ఇక్క‌డ చేప‌ట్టాల్సిన విధుల‌కు సంబంధించి జెఈవో, డిఈవో, డెప్యూటీ ఈవో(సేవ‌లు)ల‌తో క‌మిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అకామిడేష‌న్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, రిసెప్ష‌న్ వింగ్ బలోపేతం, ఎఫ్ఎంఎస్ రిడ్ర‌స‌ల్ సిస్ట‌మ్ త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌తో ఈఓ స‌మీక్షించారు.

ఈ స‌మీక్ష‌లో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ఎం.ర‌మేష్‌రెడ్డి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, స్విమ్స్ సంచాల‌కులు డాక్ట‌ర్ బి.వెంగ‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.