KOIL ALWAR TIRUMANJANAM HELD IN LOCAL TEMPLE’S _ టిటిడి స్థానికాల‌యాల్లో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 02 NOVEMBER 2021: The temple cleaning fete Koil Alwar Tirumanjanam was held at Sri Govinda Raja Swamy temple and in Sri Kodanda Rama Swamy temple on Tuesday in connection with Deepavali on November 4.

The officials of the respective temples took part in this traditional event.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి స్థానికాల‌యాల్లో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2021 నవంబరు 02: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ ఆలయాల్లో న‌వంబ‌రు 4వ తేదీన‌ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయ‌మంతటా ప్రోక్షణం చేశారు.

శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించారు. భక్తులను ఉదయం 11 గంటల నుండి దర్శనానికి అనుమతించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమాల్లో ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీమ‌తి పార్వ‌తి, శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.