PERFORM ANNAPRASADAM INVOLVING DONORS-JEO _ టీటీడీ ఆలయాల్లో దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం
TIRUPATI, 17 JUNE 2023: The TTD run temples in and around Tirupati should perform Annaprasadam to devotees involving donors, directed JEO Sri Veerabrahmam to the officials concerned.
During a virtual meeting on Saturday with the DyEOs of respective temples he said in Chandragiri, Tondavada, Mangalampeta, Buragamanda temples, already donors are doing Annaprasadam. Similarly, the other temples should also follow the same system.
He directed the concern to set up attractive boards displaying information about the respective local temples akin to Narayanavanam and Jammu temples. He also directed the officials of PR and SVBC to give wide publicity in TTD website as well in the SVBC channel.
He instructed the forest wing officials to develop greenery at all the temples to enhance the divine ambience. He later instructed the respective temple chiefs to get feedback from devotees on amenities using the services of Srivari sevaks.
Spl Gr DyEOs Smt Varalakshmi, DyEOs Sri Govindarajan, Sri Gunabhushan Reddy, Sri Vijay Kumar, Sri Devendra Babu, Smt Shanti, Sri Natesh Babu, DFO Sri Srinivasulu, AEO Sri Krishna Rao, office staff of Rishikesh, Bhuvaneshwar, Kurukshetra, Kanyakumari, Jammu were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ ఆలయాల్లో దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2023 జూన్ 17: టీటీడీ ఆధ్వర్యంలో గల తిరుపతి పరిసరాల్లోని స్థానికాలయాలు, బయటి ప్రాంతాల్లోని ఆలయాల్లో దాతల సహకారంతో అన్నప్రసాద వితరణకు చర్యలు చేపట్టాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను కోరారు. ఆయా ఆలయాల అధికారులతో శనివారం జెఈవో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ చంద్రగిరి, తొండవాడ, ఒంటిమిట్ట, మంగళంపేట, బూరగమంద తదితర ప్రాంతాల్లోని టీటీడీ ఆలయాల్లో దాతల సహకారంతో ఇదివరకే భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారని, ఇదేతరహాలో మిగతా టీటీడీ ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. బయట ప్రాంతాలకు వెళ్లే యాత్రికులకు ఆయా ప్రాంతాల్లోని టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. యాత్రికులు సంచరించే రైల్వే స్టేషన్, బస్టాండు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో సమాచారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా యాత్రికులు సులభంగా ఆలయాలకు విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారని చెప్పారు. ఈ సూచికబోర్డులు పర్యాటక శాఖ ద్వారా, ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటు చేయాలని, టీటీడీ వెబ్‌సైట్, ఎస్వీబీసీ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఇటీవల జమ్మూలోనూ, అదేవిధంగా నారాయణవనం ఆలయాల వద్ద ప్రధాన రహదారుల్లో ఏర్పాటుచేసిన ఆకర్షణీయమైన సూచికబోర్డుల తరహాలో ఇతర ప్రాంతాల్లోని టీటీడీ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ఏర్పాటు చేయాలన్నారు.
ఆయా ఆలయాల్లో కల్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జితసేవలు ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జెఈవో కోరారు. ఆలయాల్లో పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డిఎఫ్‌వోను ఆదేశించారు. ఆలయాల్లో ఉభయదారుల సంఖ్యను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆలయంలో శ్రీవారిసేవకులు, భక్తుల ద్వారా అభిప్రాయ సేకరణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమీక్షలో డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ గుణభూషణ్‌రెడ్డి, శ్రీ విజయకుమార్, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి శాంతి, శ్రీ నటేష్ బాబు, శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ కృష్ణారావు, రిషికేష్, కురుక్షేత్ర, కన్యాకుమారి, భువనేశ్వర్, జమ్మూ తదితర ఆలయాల అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.