టీటీడీ చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఈఓ
టీటీడీ చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఈఓ.
తిరుమల. 5 నవంబరు 2020: టీటీడీ ఈఓ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి గురువారం రాత్రి తొలిసారి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ని కలిశారు. తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఆయన చైర్మన్ ను కలసి బొకే అందించారు. అనంతరం టీటీడీ పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది