ALLEGATIONS BY MP SRI R KRISHNAM RAJU ON TTD CHAIRMAN CONDEMNABLE _ టీటీడీ చైర్మన్ పై ఎంపి ఆరోపణలు దురదృష్టకరం
Tirumala, 3 March 2021: TTD has condemned the allegations made by Member of Parliament Sri Raghuram Krishnam Raju on TTD Chairman Sri YV Subba Reddy over the issuance of Srivari Darshan tickets and termed as unfortunate.
The MP had alleged that the TTD Chairman’s office has not been considering his recommendation letters for sanctions of Srivari Darshan tickets.
In a statement on Wednesday, the TTD said all recommendation letters of Public Representatives including MLCs, MLAs, MPs etc. For Srivari Darshan were processed by TTD Board Cell. The Chairman has no connection with the process of issuing Srivari VIP Darshan tickets on elected representatives recommendation letters.
TTD said the board cell considers only one recommendation letter by any elected representative for a day and if any additional recommendation letters comes, it will be brought to the notice of Additional EO for consideration on merits and devotees rush.
As of now the TTD board cell has not rejected any recommendation letter of Sri Raju and if any, brought to officials notice, suitable action would have been taken, TTD stated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టీటీడీ చైర్మన్ పై ఎంపి ఆరోపణలు దురదృష్టకరం
తిరుమల 3 మార్చి 2021: ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు జారీ చేసే విధానం తో సంబందం లేని టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీద ఎంపి శ్రీ రఘురామక్రిష్ణం రాజు ఆరోపణలు చేయడం దురదృష్టకరం
ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పై దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమలలో ప్రత్యేకంగా బోర్డ్ సెల్ కార్యాలయం వుంది .
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎంపి, ఎంఎల్సి, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల పై దర్శన టికెట్లు బోర్డ్ సెల్ కార్యాలయం జారీ చేస్తుంది
ప్రజాప్రతినిధుల సంబంధించి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే బోర్డు సెల్ పరిగణనలోకి తీసుకుంటుంది.
అంతకు మించి సిఫార్సు లేఖల వస్తే వాటిని అదనపు ఇఓ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్ళి, భక్తుల రద్దీని బట్టి పరిగణనలోకి తీసుకుంటారు.
ఇప్పటి వరకు ఎంపి శ్రీ రఘురామక్రిష్ణం రాజు సిఫార్సు చేసిన లేఖలను బోర్డు సెల్ కార్యాలయం తిరస్కరించలేదు.
అటువంటి ఘటన జరిగి వుంటే అధికారులు దృష్టికి తీసుకువస్తే, పరిశీలించి తగు చర్యలు తీసుకునేవాళ్ళం.
టికెట్ల జారీ ప్రకియకి ఎలాంటి సంబంధం లేని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పై ఎంపి రఘురామక్రిష్ణం రాజు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
టిటిడి చైర్మన్ కూడా దర్శన టికెట్లకు సిఫార్సు మాత్రమే చేస్తారు. వాటిని అదనపు ఇఓ కార్యాలయం నుంచే జారీ చేస్తారు.
ఈ విషయాన్ని ఎంపి శ్రీ రఘురామక్రిష్ణం రాజు గుర్తిస్తారని భావిస్తున్నాం.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.